2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా భారత్ చేరాడు. అమెరికా నుండి అతనిని తీసుకొచ్చిన విమానం ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగినట్లు పలు మీడియా కధనాలు వస్తున్నాయి. అక్కడ నుంచి అతనిని తీహార్ జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతనిని విచారించనున్నట్లు సమాచారం. తహవూర్ రాణా రాక నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత పటిష్టం చేశారు. 64 ఏళ్ల రాణా ఇప్పటికే అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు. భారత్ ప్రభుత్వ అభ్యర్థనపై అమెరికా అతడిని అప్పగించేందుకు అంగీకరించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు