మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’.దర్శకుడు వశిష్ఠ అత్యద్భుతమైన సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.అయితే ‘విశ్వంభర’ అంటే ఓ లోకం…ఆ లోకానికీ..భూలోకానికీ సంబంధం ఏంటి? అసలు ఈ కథలో చిరంజీవి ఎవరు? వేరే లోకానికెళ్లి ఆయన సాధించేదేంటి? తదితర అంశాలన్నీ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తుంది. ఇక ఈచిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈమేరకు ఒక పోస్టర్ ను విడుదల చేసింది. గతంలో వచ్చిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రంలో చిరంజీవి పాత్రకు ఇది నెక్ట్స్ లెవల్‌గా ఉంటుందని సమాచారం.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
A Hanuman's love and reverence for his Lord Shri Ram 🏹✨#Vishwambhara First Single #RamaRaama out on April 12th ❤️🔥
Music by the Legendary @mmkeeravaani 🛐
Lyrics by 'Saraswatiputra' @ramjowrites ✒️MEGA MASS BEYOND UNIVERSE.
MEGASTAR @KChiruTweets @trishtrashers… pic.twitter.com/obH0onoxhN
— UV Creations (@UV_Creations) April 10, 2025