రష్యాలో మే 9న జరగనున్న ప్రతిష్టాత్మక విక్టరీ డే పరేడ్ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది.ఈ విషయాన్ని రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో వెల్లడించారు.నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాస్కోలో ఈ పరేడ్‌ను ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఏడాది పరేడ్ 80వ వార్షికోత్సవం కావడం విశేషం. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ హాజరవుతారో లేదో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, రష్యా ప్రధాని పుతిన్ భారత ప్రధానికి వ్యక్తిగతంగా ఆహ్వానం పంపడం గమనార్హం. ప్రపంచ రాజకీయ పరిణామాల్లో ఈ చర్య విశేష ప్రాధాన్యం సంతరించుకుంటోంది.విక్టరీ డే పరేడ్ రష్యా సైనిక శక్తిని ప్రదర్శించడమే కాక, మిత్రదేశాల నేతలతో సంబంధాలు బలోపేతం చేసుకునే వేదికగా కూడా ఉపయోగపడుతుంది. భారత్, చైనా, అమెరికా వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో, మోదీకి ఆహ్వానం రావడం ఓ వ్యూహాత్మక చర్యగా పరిగణించబడుతోంది.
Previous Articleవైసీపీ నేత కారుమూరిపై కేసు నమోదు…!
Next Article మెగాస్టార్ ‘విశ్వంభర’ నుండి ఈనెల 12న ఫస్ట్ సింగిల్