కర్ణాటక రాజధాని బెంగళూరులో తాగునీటి ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది.బెంగళూరు నీటి సరఫరా,మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) లీటరుకు సగటున 7–8 పైసల వరకు ఛార్జీలు పెంచనున్నట్టు వెల్లడించింది.జనాభా పెరుగుదల, విస్తరించిన నగర విభాగాలకు నీటి సరఫరాలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.2014 నుండి ఇప్పటివరకు ధరలు పెంచని BWSSB ప్రస్తుతం నెలకు రూ.80 కోట్ల నష్టాన్ని భరిస్తున్నది. విద్యుత్ మరియు నిర్వహణ వ్యయాలు రెండు గణనీయంగా పెరగడంతో ధరల పెంపు అనివార్యమైంది.బోర్డు ఖర్చు రూ.200 కోట్లు కాగా, ఆదాయం రూ.120 కోట్లకే పరిమితమవుతోంది.వినియోగం ఆధారంగా ధరలు పెరగనున్నాయి – ఎక్కువ నీటిని వినియోగించేవారిపై అధిక ఛార్జీలు విధించనున్నారు.ప్రతి ఏప్రిల్ 1న నీటి ధరలు 3 శాతం చొప్పున పెరిగేలా సిఫార్సులు అమలు చేస్తారు.పెంపుతో ప్రజలపై భారం పెరగనుందని విమర్శలు వస్తున్నా, నీటి సరఫరా మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ చర్యతో బోర్డు ఆర్థిక లోటును తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Previous Articleఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ అర్మాన్ ఆకస్మిక మరణం…!
Next Article ధనుష్ – మారి సెల్వరాజ్ కొత్త చిత్రం ప్రకటన…!