లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ తిరిగి విశ్వ క్రీడల్లో పునరాగమనం చేయనున్న సంగతి తెలిసిందే. 1900లో ఒకసారి ఈ క్రీడల్లో భాగమైంది. అప్పుడు కేవలం రెండు టీమ్ లు మాత్రమే పోటీ పడ్డాయి. గ్రేట్ బ్రిటన్-ఫ్రాన్స్ మధ్య రెండు రోజుల మ్యాచ్ నిర్వహించారు. ఇక లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో 6 టీమ్ లతో నిర్వహించనున్నారు. మెన్స్, ఉమెన్స్ టీమ్ విభాగాల్లో 6 టీమ్ లకు టీ20 ఫార్మాట్ లో జరగనున్నట్లు ఒలింపిక్స్ కమిటీ తెలిపింది. ఒక్కో టీమ్ లో 15 మంది ప్లేయర్లు పాల్గొనే అవకాశం ఉంది. ఆతిథ్య హోదాలో అమెరికాకు ఒక టీమ్ గా అర్హత సాధించనుంది. మిగతా 5 టీమ్ లను ఏవిధంగా ఎంపిక చేస్తారన్నది చూడాల్సి ఉంది.
Previous Articleకొనసాగుతున్న ఢిల్లీ జైత్రయాత్ర… తాజాగా ఆర్సీబీపై ఘన విజయం
Next Article ఆసియా ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ సింధు ఓటమి

