ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేడు మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. టీడీపీకి మొదట్నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని చెప్పారు. బీసీలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనని అన్నారు. అన్ని వర్గాలతో సమానంగా బీసీలు ఎదిగే వరకు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాను, డిప్యూటీ సీఎం పవన్, ప్రధాని మోడీ ముగ్గురు బీసీల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మా జ్యోతి రావు పూలే గారి స్పూర్తితో త్వరలోనే బీసీ రక్షణ చట్టం తెస్తున్నామని తెలిపారు. ఆదరణ-3 కింద బీసీలకు ఏటా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈసందర్భంగా వివిధ కుల వృత్తుల వారితో సీఎం మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా బీసీ వర్గానికి చెందిన బత్తుల జగన్నాథం గారి క్షౌరశాలకు వెళ్లి ఆయన ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. ఆయన వృత్తికి అవసరమైన కొన్ని అధునాతన పనిముట్లను జగన్నాథం గారికి అందజేసాను. వారి ఇంటి నిర్మాణానికి, కొత్త సెలూన్ నిర్మాణానికి ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల అమలులో మంచి ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు