బెంగళూరులో మత వేధింపులకు సంబంధించిన ఘటన ఒకటి కలకలం రేపింది.ఏప్రిల్ 9న చంద్రా లేఅవుట్‌లో బురఖా ధరించిన ముస్లిం యువతి, హిందూ యువకుడితో స్కూటీపై కూర్చుండగా, నలుగురు ముస్లిం యువకులు వచ్చి వారిని నిలదీశారు.వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరూ కలిసి ఉండడాన్ని ప్రశ్నించారు. యువతిని తిడుతూ,కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెను బెదిరించేందుకు యత్నించారు.అయితే ఆమె ధైర్యంగా స్పందించి, అతను తన క్లాస్‌మేట్ అని తెలిపింది.హిందూ యువకుడినీ వారే ప్రశ్నించి,దాడికి ప్రయత్నించారు.ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.వీడియో వైరల్ కావడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు,మత ఆధారంగా మోరల్ పోలీసింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హిందూ యువకుడితో పాటు స్కూటీ లో వెళ్తున్న బురఖా ధరించిన ముస్లిం యువతిపై వేధింపులు…!
By admin1 Min Read
Previous Articleటీడీపీకి మొదట్నుంచీ వెన్నెముక బీసీ వర్గాలే: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article అన్నాడీఎంకే – బీజేపీ మధ్య కుదిరిన పొత్తు…!