తమిళనాడు బీజేపీకి నూతన అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది.ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఈ పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన నియామకం ఖాయమైంది.అయితే నాగేంద్రన్ పేరును అన్నామలై స్వయంగా ప్రతిపాదించినట్టు సమాచారం.అధికారిక ప్రకటనను ఢిల్లీ పార్టీ కేంద్ర కార్యాలయం రేపు విడుదల చేసే అవకాశం ఉంది.నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు.జయలలిత మరణానంతరం బీజేపీలో చేరి, 2021లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో తిరునల్వేలి నుండి గెలుపొందారు.ఆయనకు అన్నాడీఎంకేతో మంచి సంబంధాలు ఉన్నందున,కూటమి మరింత బలపడుతుందని బీజేపీ ఆశిస్తోంది.కొత్త నాయకత్వం కింద తమిళనాడు బీజేపీ మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

