భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ట్రంప్ పరిపాలన సమయంలో నాలుగు సంవత్సరాల పాటు చర్చలు జరిపినా ఒప్పందం కుదరలేదని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ పూర్తిగా సంసిద్ధంగా ఉందన్నారు. తాజా పరిణామాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. అమెరికా పరిపాలనలో, వాణిజ్య విధానాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇది చైనా వృద్ధిని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. చైనా బిజినెస్ కథ కూడా టెక్నాలజీ ఆధారితమైందని, డీప్ సీక్ వంటి మార్పులు రెండు దేశాల మధ్య ప్రభావం చూపుతున్నాయని విశ్లేషించారు. అమెరికా-చైనా సంబంధాలు విభిన్నంగా ఉండగా, భారత్ అనుభవం వేరు అని తెలిపారు. గతంలో పోటీ కారణంగా చిక్కుల్లో పడినప్పటికీ ఇప్పుడు పరిస్థితి గోల్డిలాక్స్ సమస్య లాంటిదని వివరించారు. ప్రస్తుతం ప్రపంచం పోటీ యుగం వైపు సాగుతుందన్న జైశంకర్, ఈ పోటీలో విజయానికి దేశాలు ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరముందని సూచించారు. ఇక నుంచి వాణిజ్యం కంటే వ్యక్తిగత వ్యవహారాలే ప్రభావం చూపేలా మార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు.
Previous Articleఅన్నాడీఎంకే – బీజేపీ మధ్య కుదిరిన పొత్తు…!
Next Article తమిళనాడు బీజేపీకి నూతన అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్