పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన ‘వనజీవి రామయ్య’ నేడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలుగులో ట్వీట్ చేశారు. దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి. అంటూ ప్రధాని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు: ప్రధాని మోడీ
By admin1 Min Read
Previous Article‘విశ్వంభర’ నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
Next Article చైనాలో భారీ గాలులు… వందలాది విమాన సర్వీసులు రద్దు..!