చైనాలో భారీ గాలులు భీభత్సం సృష్టించాయి. రాజధాని బీజింగ్ లో ఈ భారీ గాలులు ధాటికి చెట్లు నేలకొరిగాయి. దీంతో అప్రమత్తమైన చైనా దాదాపు 693 ఫ్లైట్ సర్వీసులు రద్దు చేసింది. ఈమేరకు ఇంటర్నేషనల్ మీడియా కధనాలు వస్తున్నాయి. బీజింగ్, డాక్సింగ్ లో వందలాది విమానం, రైల్వే సర్వీసులు రద్దు చేయబడ్డాయి. పార్కులను కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 75 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా శక్తివంతమైన గాలులు వీచినట్లు కధనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా దేశ నార్త్, కోస్టల్ ప్రాంతాల్లో ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ గాలుల ప్రభావం వల్ల ఫుట్ బాల్ మ్యాచ్ లు, ఇతర ముఖ్య కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు