అమెరికాలో హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, హిందూఫోబియాను అధికారికంగా గుర్తించేందుకు జార్జియా రాష్ట్రం కీలక ముందడుగు వేసింది. జార్జియా స్టేట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓ ప్రత్యేక బిల్లు ద్వారా హిందూఫోబియాను గుర్తించాలని ప్రతిపాదించారు.ఈ బిల్లు చట్టంగా మారితే, జార్జియా పీనల్ కోడ్ (శిక్షాస్మృతి)ను సవరించనున్నారు.దీంతో అక్కడి దర్యాప్తు సంస్థలు హిందువులపై వివక్ష,విద్వేషపూరిత వ్యాఖ్యలు, దాడులపై చర్యలు తీసుకోవడానికి న్యాయపరమైన ఆధారం లభిస్తుంది.ఈ నెల 4న ప్రవేశపెట్టిన బిల్లుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు కలసి మద్దతు ఇవ్వడం విశేషం.ఈ చర్యతో జార్జియా రాష్ట్రం అమెరికాలో హిందూఫోబియాను గుర్తించిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది.ఈ పరిణామంపై కొయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (CoHNA) హర్షం వ్యక్తం చేసింది.బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.ఈ చట్టం అమలులోకి వస్తే హిందువుల హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు