ప్రఖ్యాత కథక్ నర్తకి కుముదిని లఖియా ఇకలేరు.ఆమె 95 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు ఆమె మరణాన్ని ధృవీకరించారు.1930లో అహ్మదాబాద్‌లో జన్మించిన కుముదిని లఖియా, కథక్ నృత్యాన్ని సాంప్రదాయ మౌలికతలతో పాటు ఆధునిక భావప్రయోగాలతో విస్తృతంగా అభివృద్ధి చేశారు.1967లో ఆమె స్థాపించిన కదంబ్ సెంటర్ ఫర్ డ్యాన్స్ ద్వారా అనేక శిష్యులను తీర్చిదిద్దారు.ఆమె నృత్యంపై అంకితభావం, సృజనాత్మకతకు గుర్తింపుగా పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను ఇప్పటికే అందుకున్న ఆమెను,2025లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.కథక్‌ను పాశ్చాత్య ప్రేక్షకులకు పరిచయం చేయడంలోనూ ఆమె పాత్ర ఎనలేనిది.కుముదిని లఖియా మరణం భారత నాట్య కళా ప్రపంచానికి తీరని లోటు.ఆమె కళా పయనం, సంప్రదాయ నృత్యరంగంలో చేసిన మార్గదర్శక కృషి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
Previous Articleఏప్రిల్ 30 తేదీ నుండి ప్రారంభం కానున్న చార్‌ధామ్ యాత్ర
Next Article కేరళ మంత్రుల కోసం కొత్త ఇన్నోవా కార్లు..!