కేరళ రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల ఉపయోగార్థం కొత్తగా 13 ఇన్నోవా క్రిస్టా కార్లు కొనుగోలు చేసింది.ఈ ప్రక్రియలో మొత్తం రూ.2.71 కోట్లు ఖర్చు చేసినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.అసెంబ్లీలో ఎంఎల్‌ఏ ఎల్డోస్ పీ కున్నప్పిల్లి అడిగిన ప్రశ్నకు సీఎం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.2022 నుండి 2024 మధ్యకాలంలో ఈ కార్లను దశలవారీగా కొన్నారు.2022లో మొత్తం 8 కార్లను,అలాగే 2024లో మరో 3 కార్లను కొనుగోలు చేశారు.ఒక్కో కారుకి 2022లో రూ.24.28 లక్షలు,2024లో రూ.25.78 లక్షల వరకు ఖర్చయ్యాయి.మంత్రులందరూ ఇన్నోవా క్రిస్టాను తమకు అనుకూలమైన వాహనంగా అభిప్రాయపడినట్లు కేరళ సీఎం పేర్కొన్నారు.
ఈ కార్లను ఉపయోగిస్తున్న మంత్రుల్లో కే రాజన్, రోషీ ఆగస్టిన్, సాజి చెరియన్, పీ ప్రసాద్, వీ శివన్‌కుట్టి, మహ్మద్ రియాస్, వీణా జార్జ్, అబూ రహిమాన్ ఉన్నారు.2024లో వీఎన్ వాసవన్, ఆర్ బిందు, జీఆర్ అనిల్ కోసం మూడు కొత్త కార్లు కొనుగోలు చేశారు.ప్రస్తుతం ఉన్న మంత్రుల వాహనాలను రీప్లేస్ చేయడమే ఈ నిర్ణయానికి కారణంగా ప్రభుత్వం తెలిపింది. ఈ ఖర్చు పట్ల కొన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపించినా, భద్రతా పరంగా మరియు మంత్రుల ప్రయాణ అవసరాల దృష్ట్యా ఇది అవసరమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.