భారత రాజ్యాంగ నిర్మాత, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి , స్వాతంత్రోద్యమ వీరుడు… ఆధునిక భారత సమాజ నిర్మాణ పునాదులు వేసిన “బాబా సాహెబ్ అంబేద్కర్” జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది” అన్నారు భారతరత్న డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా , స్వాతంత్రోద్యమ వీరుడిగా… ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందాం. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని పునరుద్ఘాటించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు