కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) అరేబియా సముద్రంలో స్మగ్లర్లు పడేసిన రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. అరేబియా సముద్రంలో భారత సముద్ర జలాల సరిహద్దు వద్ద ఈనెల 12-13 అర్థరాత్రి సమయంలో కోస్ట్ గార్డ్, ఏటీఎస్ కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈక్రమంలో ఒక బోటులో అనుమానాస్పద కదలికలు పసిగట్టి దానిని సమీపించాయి. కోస్ట్ గార్డ్ షిప్ ను చూసి స్మగ్లర్లు తమ దగ్గర ఉన్న సరుకును సముద్రంలో పడేసి పారిపోయారు. కోస్ట్ గార్డ్, ఏటీఎస్ సిబ్బంది సముద్రం నుండి సరుకు బయటకు తీశారు. దానిలో 300 కిలోల నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.1800 కోట్లు పైనే ఉంటుందని పేర్కొన్నారు.
సముద్రంలో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు
By admin1 Min Read
Previous Articleఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో భారత్ కు సిల్వర్ మెడల్
Next Article లేజర్ ఆయుధాన్ని పరీక్షించిన భారత్…!