దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలపై విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విమానంలో విరిగిన సీటు కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేయగా,ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే విమానాల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజాగా ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ కూడా విమాన ప్రయాణంలో ఎదురైన అసౌకర్యాలపై అసహనం వ్యక్తం చేశారు.రూ.50,000 చెల్లించినప్పటికీ విరిగిన టేబుల్, వంగిపోయిన సీటు ఇచ్చారని తెలిపారు.తన భార్యకు వీల్ చైర్ అవసరమైనప్పటికీ సిబ్బంది ఎలాంటి సహాయం చేయలేదని విమర్శించారు.బ్యాగులు మోయడంలో సిబ్బంది నిర్లక్ష్యం చూపారన్నారు.విమానాలు సమయానికి రాకపోవడం,మౌలిక సదుపాయాల లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వంటివి ప్రయాణికుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి.ప్రయాణ సౌకర్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు