తమిళ స్టార్ అజిత్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఇటీవలే విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్‌ను రాబట్టింది.అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పుడు ఓ కలకలం తలెత్తింది.మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తాజాగా ఈ చిత్ర మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపారు.తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన మూడు పాటలను ఈ చిత్రంలో రీ-క్రియేట్ చేసి వాడినందుకు వ్యతిరేకంగా ఆయన స్పందించారు.‘నాట్టుపుర పట్టు’లోని ‘ఓథ రుబాయుమ్ తేరెన్’,‘సకలకళా వల్లవన్’లోని ‘ఇలమై ఇధో ఇధో’, ‘విక్రమ్’లోని ‘ఎన్ జోడి మంజ కురువి’అనే పాటలను అనుమతిలేకుండా వాడారని పేర్కొన్నారు.దీనిపై రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ,పాటలను వెంటనే తొలగించాలనీ, ప్రజాపరిశుద్ధి కోసమే క్షమాపణ చెప్పాలని నోటీసులో కోరారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్‌గా నటించగా,యోగిబాబు,రాహుల్ దేవ్,అర్జున్ దాస్,సునీల్, ప్రభూ కీలక పాత్రల్లో నటించారు.ప్రస్తుతం ఈ లీగల్ వివాదం సినిమా హవాకి కొత్త మలుపు తీసుకొచ్చింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు