పంజాబ్ కింగ్స్:111 (15.3)
కోల్ కతా నైట్ రైడర్స్:95 (15.1)
ఐపీఎల్ చరిత్రలోనే తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకుని పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. కోల్ కతా నైట్ రైడర్స్ పై 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
బౌండరీలు, కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలతో బ్యాటర్ల ఆధిపత్యమే కనపడుతున్న తరుణంలో బౌలర్లు సత్తా చాటారు. మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసింది. ప్రభ్ సిమ్రాన్ (30) టాప్ స్కోరర్. ప్రియాన్ష్ ఆర్య (22), శశాంక్ సింగ్ (18), బార్ట్లెట్ (11) నేహాల్ వధేరా (10) పరుగులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హార్షిత్ రాణా 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లు, వైభవ్ అరోరా 1 వికెట్, నోర్తుజే 1 వికెట్ తీశారు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 95 పరుగులకే కుప్పకూలింది. రఘవన్షీ (37), రహానే (17), రస్సెల్ (17) మినహా అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్లలో చాహాల్ 4 వికెట్లు, జాన్సెన్ 3 వికెట్లు, బార్ట్లెట్, మ్యాక్స్ వెల్, అర్ష్ దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు