రహదారులపై టోల్ వసూళ్లను సులభతరం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఫాస్టాగ్ అకౌంట్ ద్వారా రూ.3 వేలు చెల్లించిన వాహనదారులు ఒక సంవత్సరం పాటు టోల్ చార్జీలు లేకుండానే దేశంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించగలరని సమాచారం. ఇందుకు సంబంధించి కొన్ని సంస్థలతో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇప్పటికే రెండు విడతల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.అలాగే మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ దేశంలోని కొన్ని ప్రధాన రూట్లలో ప్రారంభం కానుంది.
ఈ టెక్నాలజీ అమలుతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు.వాహనాల్లోని జీపీఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని గుర్తించి టోల్ వసూలు చేయనున్నారు.ఈ విధానం అమలవుతోన్న మొదటి దేశంగా భారత్ గుర్తింపు పొందే అవకాశం ఉంది.ప్రస్తుతం ఉన్న ఒప్పందాలపై కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ,కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ పథకాలు అమలైతే ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాదు, రవాణా వ్యవస్థ మరింత సురువుగా మారే అవకాశం ఉంది.