తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.సంజీవ్ ఖన్నా తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గవాయ్.ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో,ఆయన తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన గవాయ్ పేరును కేంద్రానికి సిఫారసు చేశారు.మే 14న జస్టిస్ గవాయ్ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా నియమితమయ్యే రెండో దళిత న్యాయమూర్తి గవాయ్ కావడం విశేషం.2019లో సుప్రీంకోర్టులో చేరిన గవాయ్, పలు చారిత్రాత్మక తీర్పుల్లో భాగమయ్యారు.ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు,ఎన్నికల బాండ్ల వ్యవస్థ రద్దుపై తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన సభ్యునిగా ఉన్నారు.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం “నోటీసు లేకుండా ఆస్తులు కూల్చరాదు” అనే కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.అడవులు, వన్యప్రాణుల పరిరక్షణపై విచారణలకు ఆయన ధర్మాసనాలు మార్గనిర్దేశం చేస్తున్నాయి.ఆయన మే 14 నుండి నవంబర్ 23, 2025 వరకూ సీజేఐగా కొనసాగనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు