భారతీయులు డోలో 650 మాత్రలను విచక్షణ లేకుండా వినియోగిస్తున్నారంటూ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెల్త్ ఎడ్యుకేటర్ పలనియప్పన్ మానిక్కం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.“భారతీయులు ఇవి క్యాడ్‌బరీ జెమ్స్‌లా తినేస్తున్నారు” అన్న ఆయన కామెంట్ నెటిజన్లను తీవ్రంగా ఆలోచింపజేసింది.కొవిడ్-19 మహమ్మారి ప్రారంభం తర్వాత డోలో 650 వాడకం విపరీతంగా పెరిగింది.జ్వరం,తలనొప్పి,ఒళ్లు నొప్పులు వంటి లక్షణాల నివారణకు వైద్యులు సూచించిన ఈ మందు,పారాసిటమాల్ అధిక మోతాదులో ఉండటంతో కాలేయం, కిడ్నీలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వైద్యుల సూచన లేకుండా తరచూ వాడడం ప్రమాదకరమని హెచ్చరికలు వస్తున్నాయి.ఒకప్పుడు ఏడాదికి 7.5 కోట్ల స్ట్రిప్స్ మాత్రమే అమ్మిన మైక్రో ల్యాబ్స్, 2021 చివరినాటికి 14.5 కోట్ల స్ట్రిప్స్ విక్రయించి, రూ.400 కోట్లకు పైగా ఆదాయం పొందింది. వైద్యుల సూచన మేరకు మాత్రమే డోలో 650 వాడాలని నిపుణులు మళ్లీ హెచ్చరిస్తున్నారు.ప్రజలు తమకు తాము డయగ్నోసిస్ చేసుకొని మందులు తీసుకోవడం ప్రమాదకరమని ఆరోగ్య వేత్తలు అంటున్నారు.
డోలో 650 ను క్యాడ్‌బరీ జెమ్స్‌లా తినేస్తున్నారంటూ…డాక్టర్ వ్యాఖ్యలు వైరల్
By admin1 Min Read
Previous Articleతదుపరి సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్…!
Next Article ఇక్రిశాట్‌లో కలకలం…బోనులో చిక్కిన చిరుతపులి…!