అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్న ఆఫర్ చేశారు.మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, అమెరికాను స్వచ్ఛందంగా వీడాలనుకుంటే,వారికి విమాన టికెట్లు కొనిచ్చేందుకు,అవసరమైన ఖర్చులకు కొంత డబ్బు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.అమెరికాలో స్వచ్ఛంద రిటర్న్ ప్రోగ్రామ్ అమలులో ఉన్నట్లు చెప్పారు.అవసరమైతే భవిష్యత్తులో వారిని తిరిగి అధికారికంగా దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అన్నారు.హోటళ్లు,వ్యవసాయ రంగాల్లో అవసరమైన కార్మికుల కొరతను తీర్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.ఇప్పుడు వెళ్లిన వారే తర్వాత అవసరమైన సమయంలో అధికారిక మార్గాల్లో తిరిగి రాగలరని చెప్పారు.ఈ ప్రకటనపై అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలవుతున్నాయి.వలస విధానంపై ట్రంప్ చూపించిన ఈ కొత్త దృక్కోణం, ఎన్నికల వేళ కీలకంగా మారే అవకాశముంది.
అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్ – స్వచ్ఛందంగా వెళ్లితే విమాన టికెట్లు, డబ్బు ఇస్తాం !
By admin1 Min Read
Previous Articleప్రపంచంలో మొదటిసారిగా ‘స్పెర్మ్ రేస్’…!
Next Article ప్రధాని మోడీ అమరావతి పర్యటన ఖరారు