ప్రతిష్టాత్మక ఆసియా అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత అథ్లెట్లు నితిన్ గుప్తా , తన్ను అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నీలో వీరిద్దరూ సిల్వర్ మెడల్స్ తో ఆకట్టుకున్నారు. సౌదీ అరేబియాలో జరిగిన పురుషుల 5000 మీటర్ల రేస్ వాక్ లో నితిన్ 20 నిమిషాల 21.51 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన నింగ్ హవో జు 20నిమిషాల 21.50 సెకన్లలో పూర్తి చేసి మొదటి స్థానంతో గోల్డ్ కైవసం చేసుకున్నాడు. మహిళల 400 మీటర్ల రేస్ ను తన్ను 57.63 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది.
ఆసియా అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ తో రాణించిన భారత అథ్లెట్లు
By admin1 Min Read
Previous Articleప్రధాని మోడీ అమరావతి పర్యటన ఖరారు
Next Article రెండు గోల్డ్ మెడల్స్ తో అదరగొట్టిన భారత షూటర్ సురుచి