కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘2209’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.బుధవారం అధికారికంగా షూటింగ్‌ను ప్రారంభించారు.2209 లో జరిగే ఓ వినూత్న సైన్స్ ఫిక్షన్ కథగా, ఆద్యంతం థ్రిల్లింగ్ యాక్షన్ ఎక్స్‌పీరియెన్స్ తో రూపొందిస్తున్నారని సమాచారం.థియేటర్లో అత్యాధునిక విజువల్స్,కథనంతో ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం తెలిపింది.ఈ సినిమా భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మరో మెట్టు అవుతుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ చిత్రం సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
2209 AD – #BRBFirstBlood ⭐️🥂
The journey begins today.To us, this mammoth dream and vision of our team,going on floor is an unparalled excitement.@brbmovie @anupsbhandari @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/O4UjrjQzMP
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 16, 2025