ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి శంకుస్థాపన చేశారు.క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా సినిమాలు,వెబ్ కంటెంట్,స్ట్రీమింగ్ రంగాల్లో వినూత్న మార్పులను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సంస్థ స్మార్ట్ ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేస్తూ,స్క్రిప్ట్ డెవలప్‌మెంట్,ప్రీ-విజువలైజేషన్,ఎడిటింగ్ వంటి సృజనాత్మక ప్రక్రియల్లో సహాయపడుతుంది.
దిల్‌రాజు మాట్లాడుతూ…“ఇది కేవలం కంటెంట్ సృష్టించడానికే కాదు,మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి శక్తినిచ్చే ఏఐ వ్యవస్థను నిర్మించడానికే” అని తెలిపారు.క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌తో భాగస్వామ్యం ద్వారా వినోదరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.ఈ ఏఐ ప్లాట్‌ఫామ్ పేరు,పూర్తి వివరాలను మే 4న అధికారికంగా ప్రకటించనున్నారు.టెక్నాలజీ మేళవింపుతో సినిమా రంగం కొత్త దిశగా వెళ్తుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.