అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) విభాగాధిపతి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ తెలిపారు. ‘టెస్లా’ సీఈఓ ఎలాన్ మస్క్ తో పలు అంశాలపై మాట్లాడా. ఈ సంవత్సరం ప్రారంభంలో వాషింగ్టన్ సమావేశంలో మాట్లాడిన అంశాలను కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెక్టార్లలో పరస్పర సహకారంపై చర్చించినట్లు తెలిపారు. ఈ రంగాల్లో భారత్ అమెరికాతో భాగస్వామ్యం మరింత పటిష్టం చేసేందుకు భారత్ కృత నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అలాగే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా, స్టార్ లింక్ భారత మార్కెట్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు