గుంటూరు జిల్లా, లాంలో ఒక ప్రముఖ సంస్థ వారు ఏర్పాటు చేసిన పద్మ విభూషణ్ శ్రీ రతన్ టాటా విగ్రహాన్ని ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆవిష్కరించారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని ఆయన గొప్ప మానవతావాది అని ఈసందర్భంగా కొనియాడారు. విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు అసామాన్యమని తెలిపారు. దేశానికి, ప్రజలకు రతన్ టాటా చేసిన సేవలను నిత్యం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని నాలుగేళ్ల క్రితమే ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ పేర్కొన్నారు. అవార్డు ఇచ్చినా, లేకున్నా ఆయన భారతీయుల హృదయాల్లో రత్నమేనని అన్నారు. సాధారణంగా ఎక్కడైనా వెంచర్లలో దేవుళ్ల విగ్రహాలు పెడతారని అయితే ఇక్కడ రతన్ టాటా విగ్రహం పెట్టిన యాజమాన్యాన్ని రఘురామ ఈసందర్భంగా అభినందించారు.
రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
By admin1 Min Read
Previous Articleఎలాన్ మస్క్ తో ప్రధాని మోడీ ఫోన్ కాల్…కీలక అంశాలపై చర్చ
Next Article ఈనెల స్వచ్ఛ ఆంధ్ర థీమ్ ను తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు