వాంఖడే స్టేడియంలో తాను ఒకప్పుడు లోపలికి అడుగుపెట్టడానికే చాలా కష్టంగా ఉండేదని ఆలాంటిది ఇప్పుడు తన పేరిట స్టాండ్ ఉండడమంటే అసలు నమ్మశక్యంగా లేదని భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇటీవల వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మరో రెండు స్టాండ్స్ కు అజిత్ వాడేకర్, శరద్ పవార్ ల పేర్లు పెట్టనున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ స్పందించాడు. ముంబై రంజీ టీమ్ ప్రాక్టీస్ చేస్తుంటే చూడడానికి అనుమతి కోసం వాంఖడే బయట నిల్చున్న రోజులు ఇంకా గుర్తున్నాయి. ఆజాద్ గ్రౌండ్ లో అండర్-14 ట్రైనింగ్ ముగించుకుని ముంబై రంజీ టీమ్ ను చూసేందుకు స్నేహితులతో కలిసి వాంఖడేకు వెళ్లే వాడిని. స్టేడియం లోపలికి అనుమతి ఎంత కష్టమో నాకు తెలుసు అలాంటిది ఇప్పుడు స్టేడియంలో ఒక స్టాండ్ కు నా పేరంటే నమ్మశక్యంగా లేదని ఇంతటి గౌరవం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Previous Articleరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై పంజాబ్ కింగ్స్ విజయ బావుటా
Next Article ఆఫ్రికా దేశం బోట్స్వానా నుండి భారత్ కు మరో 8 చీతాలు