ఏపీ సీఎం చంద్రబాబు నేడు 75వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రాష్ట్రంలో అధికార పక్షంలో భాగమైన జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనితర సాధ్యుడు చంద్రబాబు. 75వ పుట్టిన రోజు సందర్భంగా వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం చంద్రబాబు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ శుభ సమయాన ఆయనకు సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read