ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఏపీ ప్రభుత్వము 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 20వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేది నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 వ తేది నుండి జులై 6 వ తేదీ వరకు సి.బి.టి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డీఎస్సీ -2025 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు 20.04.2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ (https://cse.ap.gov.in / https://apdsc.apcfss.in) నందు అందుబాటులో ఉంచనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు