వేసవికాలం ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఏసీలు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈనేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ లో 6 శాతం పొదుపు చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ఏడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసుకోవచ్చని దీంతో రూ.10 వేల కోట్లు మిగిల్చినట్లని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీ వినియోగిస్తున్నారు. హోటళ్లు, ఎయిర్ పోర్ట్ లు, షాపింగ్ మాల్స్, ఆఫీస్ లు, గవర్నమెంట్ బిల్డింగ్స్, కమర్షియల్ ప్రాంతాల్లో ఏసీలను వినియోగించేప్పుడు 24 డిగ్రీలు ఉంచితే కార్బన్ ఎమిషన్ విడుదల తగ్గుతుంది. ఏసీల జీవితకాలం కూడా పెరుగుతుంది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించినట్లు బీఈఈ పేర్కొంది.
24°c వద్ద ఏసీ వినియోగిస్తే… ఏడాదికి 20 బిలియన్ యూనిట్ల విద్యుత్, రూ.10 వేల కోట్లు పొదుపు
By admin1 Min Read