క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్.. 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పోప్ తుది శ్వాస విడిచారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ధృవీకరించింది. ఈ విషాద వార్తను వాటికన్ కామెర్లెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ తన 12వ ఏట నుండే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితమై పనిచేశారు. ఆయన జీవితం విలువలతో నిండి ఉందని, విశ్వాసం, ధైర్యం, సార్వత్రిక ప్రేమకు పోప్ ప్రతీక అని ఫెర్రెల్ తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు