సమగ్రాభివృద్ధి అంటే దేశంలోని ఏ ఒక్క గ్రామం, ఏ ఒక్క కుటుంబం, ఏ ఒక్క పౌరుడు కూడా వెనకబడకూడదని అర్థమని తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల 1000 ఏళ్ల భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదని ప్రధాని మోడీ అన్నారు. నేడు ‘సివిల్ సర్వీసెస్ డే’ సందర్భంగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ యువత, రైతులు, మహిళల ఆకాంక్షలు నెరవేర్చుతూ ఉన్నతస్థాయికి ఎదిగేందుకు ఆ నిర్ణయాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సాంకేతికత పరుగులు తీస్తున్న ఈరోజుల్లో పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదని కొత్త అవకాశాలు ఏర్పరచడం పథకాలు ప్రజలపై ఎంత ప్రభావం చూపుతుందనేది కీలకమని అన్నారు. దాని ఆధారంగానే నాణ్యమైన పాలన కొనసాగించడం సాధ్యపడుతుందని అన్నారు. ఈ పదేళ్లలో భారత్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని పాలన పారదర్శకత, ఆవిష్కరణ ఇలా ఎన్నో రంగాల్లో కొత్త మార్క్ నెలకొల్పుతోందని చెప్పారు. దేశం ఘనతలను గుర్తు చేసుకున్నారు.పేదల సమస్యలు ఓపిగ్గా వినాలని వారితో సున్నితంగా వ్యవహరించాలని గౌరవించాలని వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సివిల్ సర్వెంట్లకు విజ్ఞప్తి చేశారు.
పరిపాలనకు అదే నిర్వచనం…సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోడీ
By admin1 Min Read
Previous Articleఇస్రో స్పేడెక్స్ మిషన్… విజయవంతంగా సెకండ్ డాకింగ్ ప్రక్రియ
Next Article క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత