బీసీసీఐ 2024-25 సెంట్రల్ కాంట్రాక్టులను నేడు ప్రకటించింది. ఈసారి భారీగా యువ క్రికెటర్లకు కాంట్రాక్టులు దక్కడం విశేషం. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి కాంట్రాక్టులు దక్కించుకున్నారు. తెలుగు తేజం నితీష్ రెడ్డి కూడా కాంట్రాక్టు దక్కించుకున్నాడు. మొత్తంగా 34 మంది క్రికెటర్లను నాలుగు విభాగాలలో ఎంపిక చేసింది.
గ్రేడ్ A+:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు కాంట్రాక్టు లోని టాప్ కేటగిరీలో చోటు సంపాదించుకున్నారు. వీరికి రూ.7 కోట్లు వేతనం లభిస్తుంది.
గ్రేడ్ A:
కే.ఎల్.రాహుల్, మహ్మద్ సిరాజ్, హార్థిక్ పాండ్య, శుభ్ మాన్ గిల్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్. వీరికి రూ.5 కోట్లు.
గ్రేడ్ B:
సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైశ్వాల్, శ్రేయాస్ అయ్యర్, కుల్ దీప్ యాదవ్. వీరికి రూ.3 కోట్లు వేతనం.
గ్రేడ్ C:
రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాకు దక్కింది. వీరికి రూ.కోటి వేతనం లభిస్తుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు