కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు దిగారు. నేడు అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్ట్ లపై కాల్పుల జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ సంఘటనతో పహల్గాంలో ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది.
మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ వ్యాలీ ఎగువ ప్రాంతంలోని ఒక పర్యాటక రిసార్టు వద్ద ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరుకునే వీలుంటుంది. ఇలాంటి ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైనికుల వంటి దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, వైద్య బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన టూరిస్ట్ లను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి… టూరిస్ట్ లపై కాల్పులు జరిపిన దుండగులు
By admin1 Min Read
Previous Articleయూపీఎస్సీ రిజల్ట్స్-2024…సత్తా చాటిన పలువురు
Next Article ఎయిర్ పోర్ట్ లోనే ప్రధాని మోడీ అత్యవసర భేటీ