జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో నిన్న జరిగిన ఉగ్రదాడి ఘటన కుదిపేసింది. అమాయక టూరిస్ట్ లపై టెర్రరిస్టు లు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రాత్రి హూటాహూటిన జెడ్డా నుండి భారత్‌కు బయలుదేరి వచ్చేశారు. నేటి ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ప్రధాని ఎయిర్‌పోర్టులోనే అత్యవసర భేటీ నిర్వహించారు.
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో సమావేశమై దుర్ఘటనపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి దాడి జరిగిన తీరును వివరించారు. కాగా, ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇక, ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా..శ్రీనగర్ చేరుకుని భద్రతా ఉన్నతాధికారులతో భేటీ అయి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. దాడి జరిగిన పహల్గాం ప్రాంతానికి వెళ్లి అమిత్ షా పరిశీలించనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు