పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో కావలి వాసి మధుసూదన రావు సోమిశెట్టి హతమయ్యారు. కాగా , వారి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి , సత్యకుమార్ , ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రదాడిని పవన్ తీవ్రంగా ఖండించారు.ఒక చిన్న బిడ్డ ముందు తన తండ్రిని చంపిన దారుణం ఇదని ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరెయ్యాలని పేర్కొన్నారు.
ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరెయ్యాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read