ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి ఫొటోను రాష్ట్రపతి తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇక భారత్ కు అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు లభిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో ఇతర దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.
రాష్ట్రపతితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ భేటీ
By admin1 Min Read