ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి కేసుని ఆ రాష్ట్ర పోలీసుల నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారికంగా తీసుకుంది. ఘటనపై సెక్యూరిటీ ఫోర్సెస్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇన్విస్టిగేషన్ చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తాజాగా ఈ కేసును NIA తీసుకుంది. NIA బృందాలు పహాల్గాంలో విచారణ చేపట్టాయి. ఘటన జరిగిన సమయంలో ఉగ్రవాదులను చూసిన టూరిస్ట్ లను పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ టూరిస్ట్ లు తీసుకున్న ఫోటోలు, వీడియోలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. పహాల్గాం ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాలలో ఫోరెన్సిక్ టీమ్ సహాయంతో తనీఖీలు ముమ్మరం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు