ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మే2న ప్రధాని మోడీ చేతుల మీదుగా పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని ఈ భారీ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇక ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్ చేశారు. గ్రహణం అనేది ఎంతో కాలం ఉండదు. స్వయం ప్రకాశకాలు అయిన సూర్యచంద్రుల మాదిరిగానే… స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అయిన ప్రజా రాజధాని అమరావతి కూడా ఐదేళ్ళ గ్రహణం నుండి బయటపడి మళ్ళీ వెలుగుబాట పట్టింది. పునర్నిర్మాణానికి సిద్ధం అవుతోందని ఒక వీడియోను కూడా తన పోస్ట్ కు జత చేశారు.
గ్రహణం అనేది ఎంతో కాలం ఉండదు. స్వయం ప్రకాశకాలు అయిన సూర్యచంద్రుల మాదిరిగానే… స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అయిన ప్రజా రాజధాని అమరావతి కూడా ఐదేళ్ళ గ్రహణం నుండి బయటపడి మళ్ళీ వెలుగుబాట పట్టింది. పునర్నిర్మాణానికి సిద్ధం అవుతోంది.#ManaAmaravati#AmaravatiTheRise#AndhraPradesh pic.twitter.com/Ygt53D3XUq
— Lokesh Nara (@naralokesh) April 27, 2025

