అమరావతి విట్ యూనివర్సిటీలో ‘వి లాంచ్పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్పో’లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు . మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. అమరావతిలో 5 లక్షల మంది విద్యార్థులు చదవాలని పేర్కొన్నారు. విట్ లో 50 వేల మంది విద్యార్థులు ఉండాలని కేవలం ఏపీ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల విద్యార్థులు ఉండాలని అన్నారు. అమరావతిలో 30శాతం పచ్చదనం, నీరుతో నిండి ఉంటుంది. ఇప్పుడున్న వర్సిటీలతోపాటు మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి. విశాఖలో “గూగుల్” సంస్థ భారీ పెట్టుబడులు.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అన్నారు. మే 2న ప్రధాని మోడీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కానుందని తెలిపారు. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన పిల్లలు ప్రపంచస్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వాట్సప్ సేవ ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ సర్వీసులు దగ్గర చేసినట్లు వివరించారు. వాట్సప్ ద్వారా వెయ్యి రకాల సేవలు అందిస్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి మార్గసూచి రూపొందిస్తున్నాం. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదుగుతోందన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగంతో సంతృప్తి చెందవద్దని కొత్త సంస్థలు స్థాపించాలని సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈవోలంతా తెలుగోళ్లు, భారతీయులేనని ఈసందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉండాలని అన్నారు. పీ4 ద్వారా పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నాం. 20శాతం ధనవంతులు 20శాతం పేదవారిని పైకి తీసుకురావాలి. ఒకప్పుడు జన్మభూమి కోసం చాలా మంది అలా పని చేశారు. ఇప్పుడు మార్గదర్శి, బంగారు కుటుంబం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఆలోచించడం ద్వారా యువత విజయం సాధించాలి. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేయాలని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు