దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ’ (సీసీపీఏ) నేడు సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో ప్రధాని నిన్న తన నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు ‘సూపర్ కేబినెట్’ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ, ఆర్థిక, జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై సమీక్ష నిర్వహించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సీసీపీఏ కీలక పాత్ర పోషిస్తోంది. 2019 పుల్వామా దాడి తర్వాత ఫిబ్రవరి 2019లో సూపర్ కేబినెట్ భేటీ అయింది. ఆ సందర్భంగా సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై సమీక్షతోపాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 26, 2019న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో తాజా భేటీలో తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.సీసీపీఏకు ప్రధాని మోడీ అధ్యక్షుడిగా ఉండగా….రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) కూడా నేడు సమావేశమైంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు