దేశ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు (NSAB)ను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డుకు కొత్త ఛైర్మన్గా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (‘RAW’) మాజీ అధిపతి అలోక్ జోషిని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి అనంతరం కీలక నిర్ణయాలతో భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (CCS) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలోక్ జోషితో పాటు మరో ఆరుగురు మాజీ ఉన్నతాధికారులను బోర్డులో సభ్యులుగా నియమించారు. వీరిలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన మాజీ అధికారి ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, సైన్యానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, నౌకాదళ మాజీ అధికారి అడ్మిరల్ మోంటీ ఖన్నా ఉన్నారు. వీరితో పాటు మాజీ ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ దౌత్యవేత్త బి. వెంకటేశ్ వర్మలను కూడా సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ నియామకాల ద్వారా వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులను సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులోకి తీసుకునట్లయింది.
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు కొత్త ఛైర్మన్ గా RAW మాజీ చీఫ్ అలోక్ జోషి
By admin1 Min Read

