సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో 7 మంది భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. కాగా, బాధిత కుటుంబాలను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. విశాఖపట్నం మధురవాడలోని చంద్రంపాలెం వద్ద బాధిత కుటుంబం ఉమామహేష్, శైలజ భౌతికకాయాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సింహాచలంలో బుర్రలేకుండా ప్రభుత్వం గోడను కట్టారని మండిపడ్డారు. గోడ కూలిపోయే ముందు ఫ్లెక్సీ లాగా ఊగిందని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో బాధితులకి కోటి రూపాయలు ఇచ్చి చంద్రబాబు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఆరోజుల్లో లక్షల మంది ప్రజలు వస్తారని తెలిసి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు బలిగొన్నారు. క్యూలో నిలబడ్డవాళ్లకు నీళ్లు లేవు. కనీసం టాయిలెట్స్‌లేవు. ఆరురోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టి, రెండు రోజుల కిందట గోడ పూర్తి చేసారని 20 మీటర్ల ఈ గోడ నిర్మాణానికి కనీసం టెండర్లు కూడా పిలవలేదు. మంత్రుల పర్యవేక్షణ అన్నారు. చందనోత్సవం ఉంటుందని తెలిసీ గోడ నిర్మాణం ముందే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు