చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో మరో ఓటమితో పదో స్థానాన్ని పదిలం చేసుకుంది. తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 190 పరుగులు చేసింది. సామ్ కరన్ 88 (47; 9×4, 4×6) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బ్రెవిస్ 32 (26; 2×4, 1×6) పర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో చాహాల్ హ్యాట్రిక్ తో అదరగొట్టాడు. అతను ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ 2 వికెట్లు , యెన్సెన్ 2 వికెట్లు తీశారు. టార్గెట్ ఛేదించే క్రమంలో పంజాబ్ ఎక్కడా తడబడలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 72 (41; 5×4, 4×6), ప్రభ్ సిమ్రాన్ 54 (36; 5×4, 3×6) రాణించారు. దీంతో 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్లయింది. 10 మ్యాచ్ లలో 8 పరాజయాలు 2 గెలుపులతో కొనసాగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు