2023లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ మాస్ మేకోవర్‌లో కనిపించనుండగా, పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ నటులు భాగమవుతుండటం సినిమాపై హైప్‌ను పెంచుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా సినిమా సెట్స్ నుంచి లీకైన ఓ స్టిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఆ స్టిల్‌లో తెలుగు నందమూరి బాలకృష్ణ పోలీస్ యూనిఫారంలో దర్శనమిచ్చారు.దీంతో ఆయన చిత్రంలో శక్తివంతమైన పోలీస్ పాత్రలో నటిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే సూపర్ స్టార్ రజనీకాంత్,కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మలయాళి అగ్రనటుడు మోహన్‌లాల్‌తో కలిసి బాలయ్య ఉన్న చిత్రం లీక్ అయింది.ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.జైలర్-2 కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని సమాచారం.మొదట ఎస్.జె.సూర్య కీలక పాత్రలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ,బాలకృష్ణ పాత్రను చిత్రబృందం సీక్రెట్‌గా ఉంచింది.కానీ లీకైన ఫోటోతో ఆయన పాత్ర స్పష్టమవుతోంది.రజనీకాంత్-బాలయ్య సన్నివేశాలు ఈ సారి భారీ హైలైట్‌గా నిలవనున్నాయి అని సమాచారం.