అశేష జన వాహిని మధ్యలో, అతిరథ మహారధులు సమక్షంలో అమరావతి పునః ప్రారంభం అయింది. కనుల పండుగగా జరిగిన ప్రజా రాజధాని పనుల పునః ప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య-ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర – రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. తెలుగులో కూడా మాట్లాడారు. అమరావతిని ఒక శక్తిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం వదిలేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. శరవేగంగా అధునాతన మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్న ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుంది. ఆ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కూడా అందుకుంటోందని ఈరోజు రాష్ట్రంలో వేలకోట్ల రోడ్డు, రైల్వే ప్రాజక్టులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. వచ్చే జూన్ 21న ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏపీలో జరుపుకుందాం. ప్రపంచ రికార్డులను సృష్టిద్దామని మోడీ పిలుపునిచ్చారు. ఏపీ ఇప్పుడు సరైన ప్రగతి పథంలో వెళ్తోంది. ఇదే వేగం ఇక ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్ళలో పూర్తి చేస్తానన్నారు. అందుకు ఎంతటి సహకారానికైనా కేంద్రం సిద్ధమని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు