రోడ్ యాక్సిడెంట్లలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత ట్రీట్మెంట్ అందించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణం ఇది అమలులోకి వచ్చినట్లు అందులో తెలిపింది. రహదారి ప్రమాదాల్లో బాధితులకు గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ అందించాలని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి ‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ -2025’ గా పేరు పెట్టింది. మోటార్ వెహికల్ వలన ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ స్కిమ్ కింద హాస్పిటల్స్ లో రూ.1.5 లక్షల వరకూ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందడానికి అర్హులవుతారు. యాక్సిడెంట్ అయినప్పటి నుండి 7 రోజుల వరకు ఈ సేవలు పొందవచ్చు. పేషేంట్ కు ట్రామా పాలీ ట్రామా సేవలు అందించే సామర్థ్యం ఉన్న అన్ని హాస్పిటల్స్ ను ఈ స్కీమ్ కిందకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం ఈ నోటిఫికేషన్ లో సూచించింది.
‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్-2025’ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
By admin1 Min Read