ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 7 నుంచి రేషన్‌కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.కొత్త రేషన్‌కార్డులు, కుటుంబసభ్యుల చేరిక-తీసివేత, చిరునామా మార్పులు వంటివి చేసుకోవచ్చని వివరించారు. అర్హత లేకుండా రాయితీ పొందుతున్న వారు కార్డులను సరెండర్ చేయాలని సూచించారు.క్యూ ఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సభ్యులు పేర్ల అన్ని చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ చేస్తామన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలల రేషన్ తీసుకున్న వివరాలు కూడా కనిపించేలా వీటిని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే విధంగా ఈ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలను కూడా తెలుసుకోవచ్చన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ అవుతుందని ఆయన స్సష్టం చేశారు. జూన్ నుండి ఈ స్మార్ట్ కార్డులు జారీ అవునన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 95 శాతం మేర ఈ కేవైసి పూర్తయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ కేవైసి పూర్తయిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన
By admin1 Min Read